తెలంగాణ
Revanth Reddy: కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు

Revanth Reddy: కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. కిషన్ రెడ్డి రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడారని అన్నారు. కిషన్ రెడ్డి పూర్తిగా డాక్యుమెంట్లు చదవాలని అన్నారు. ఉద్యోగాలు, విద్యకి సంబంధించి కేటగిరీలు ఉంటాయని రాజకీయ రిజర్వేషన్లకు ఎలాంటి కేటగిరి ఉండదని అన్నారు. కేంద్ర మంత్రిగా ఉండి అవగాహన లేకుండా మాట్లాడారని విమర్శించారు. బీసీలపై ప్రేమ ఉంటే వెంటనే అమలు చేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు.



