News
శబరిమలకు పోటెత్తిన భక్తులు

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. మండల-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ ప్రారంభం కావడంతో సన్నిధానం భక్తులతో కిటకిటలాడుతోంది. రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతుండటంతో దర్శనానికి క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంటోంది.
ఆన్‌లైన్, స్పాట్ బుకింగ్ ద్వారా భక్తులు దర్శనానికి చేరుకుంటున్నారు. మరోవైపు రద్దీని నియంత్రించేందుకు పోలీసులు, ట్రావెన్‌కోర్ దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నిలక్కల్ వద్ద వాహనాల రాకపోకలపై నిఘా పెంచారు. జనవరి 14న మకరవిళక్కు ఉత్సవం జరగనుండటంతో శబరిమలలో భక్తుల సందడి మరింత పెరగనుంది.



