News
తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సోల్లా బొజ్జి రెడ్డి, తెలంగాణ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, పద్మభూషణ్, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ ఆలయ సిబ్బంది స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.



