జాతియం

Kishan Reddy: డ్రగ్స్ రహిత సమాజమే వికసిత భారత్‌కు పునాది

Kishan Reddy: డ్రగ్స్ రహిత సమాజమే వికసిత భారత్‌కు పునాది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 2029 నాటికి డ్రగ్స్ రహిత దేశమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. సికింద్రాబాద్‌లోని ఎస్‌వీఐటీ మహబూబ్ కాలేజ్ ఆడిటోరియంలో నిర్వహించిన నషా ముక్త్ భారత్ – వాక్ ఫర్ డ్రగ్స్ ప్రవాస్ మిలాన్ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యం సాధించాలంటే వ్యసన రహిత యువతరం అవసరమని అన్నారు. డ్రగ్స్‌పై పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, యువతను చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button