తెలంగాణ

నేడు బీఎం సందీప్‌తో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భేటీ

తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి రాజకీయ చర్చకు తెరలేచింది. సీఎం రేవంత్‌రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. నేడు కొత్త రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్ బీఎం సందీప్‌తో ఆయన భేటీ కానున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రాజగోపాల్‌రెడ్డి.. మంత్రి పదవి కోసం తన పోరాటం కాదని, మునుగోడు ప్రజల కోసమేనని స్పష్టం చేస్తున్నారు.

కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తన లక్ష్యమని ప్రకటించారు. మరోవైపు రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై ఇప్పటికే టీపీసీసీ అధిష్ఠానానికి నివేదిక పంపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త ఇన్‌చార్జ్‌తో జరిగే భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. సాయంత్రం జరిగే ఈ సమావేశం తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button