అంతర్జాతీయం
అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు

అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. పర్షియన్ గల్ఫ్ మీదుగా వెళ్తున్న అమెరికా ఎఫ్-16 ఫైటర్ జెట్‌ను దెబ్బతీశామని ఇరాన్ ప్రకటించడం కలకలం రేపుతోంది. తమ భూభాగం మీదుగా ప్రయాణిస్తున్న అమెరికా యుద్ధ విమానంపై దాడి చేసినట్లు ఇరాన్ వర్గాలు వెల్లడించాయి. అటు హర్మూజ్ జలసంధి ప్రాంతంలో అమెరికాకు చెందిన డ్రోన్‌ను కూడా కూల్చివేసినట్లు ఇరాన్ ఐఆర్‌జీసీ ప్రకటించింది.
అయితే ఇరాన్ చేసిన ఈ ప్రకటనలను అమెరికా తీవ్రంగా ఖండించింది. ఇరాన్ వాదనల్లో వాస్తవం లేదని.. అవన్నీ అసత్య ప్రచారమని యూఎస్ సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య మరోసారి మాటల యుద్ధం ముదురుతుండగా.. గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఈ పరిణామాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయన్నది అంతర్జాతీయంగా ఉత్కంఠ రేపుతోంది.



