తెలంగాణ
హన్మకొండలో బీఆర్ఎస్ బహిరంగ సభ

హనుమకొండలో ఇవాళ బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సభకు హాజరుకానుండటంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ నేతలు భారీ జనసమీకరణ చేపడుతున్నారు.
ఎన్నికలే టార్గెట్గా నిర్వహిస్తున్న ఈ సభ ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపడంతో పాటు.. వరంగల్ రాజకీయాల్లో బీఆర్ఎస్ తన బలాన్ని చాటుకునేందుకు సిద్ధమవుతోంది. కేటీఆర్ ప్రసంగంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సభా వేదికగా ఆయన ఎలాంటి సందేశం ఇవ్వనున్నారు.. గ్రేటర్ వరంగల్ ఎన్నికలపై ఎలాంటి వ్యూహాన్ని ప్రకటించనున్నారు అన్నది ఉత్కంఠగా మారింది.



