అంతర్జాతీయం

Trump: సజావుగా చర్చలు.. విఫలమైతే ఇరాన్‌పై మళ్లీ దాడులే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో చర్చలు సజావుగా సాగుతున్నాయని, ఒక ఒప్పందం కుదిరేందుకు మంచి అవకాశం ఉందని తెలిపారు. అయితే, ఈ చర్చలు విఫలమైతే మాత్రం రెండు రోజుల క్రితం ఆపిన సైనిక దాడులను పునఃప్రారంభిస్తామని గట్టిగా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటలకే, మిచిగాన్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో ట్రంప్ స్వరం మార్చారు. దౌత్య మార్గాలు ఫలించకపోతే ఇరాన్‌ను చితకబాదుతామని’ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అమెరికా-ఇరాన్ మధ్య ప్రత్యక్ష దాడులు తాత్కాలికంగా ఆగినా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గలేదు. సోమవారం సౌదీ అరేబియా, జోర్డాన్, ఇరాక్‌లలోని పలు ప్రాంతాలపై డ్రోన్ దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ మద్దతున్న గ్రూపులే ఈ దాడులకు పాల్పడ్డాయని సౌదీ ఆరోపించింది. మరోవైపు, తాము చర్చల కోసం అభ్యర్థించామన్న వార్తలను ఇరాన్ ఖండించింది. మధ్యవర్తుల ద్వారా సందేశాలు మార్పిడి చేసుకుంటున్నామని, కానీ చర్చలు కోరడం తమ విధానం కాదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button