అంతర్జాతీయం
జపాన్‌లో భారీ వర్షాల బీభత్సం

జపాన్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా నాగోయా నగరాన్ని రికార్డు స్థాయి వర్షపాతం వణికించింది. కేవలం గంట వ్యవధిలోనే ఏకంగా 104.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలోని రహదారులు జలమయమయ్యాయి. అండర్‌పాస్‌లు, భూగర్భ ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
భారీ వర్షాల ప్రభావంతో రైలు, రోడ్డు రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు, ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న ఆసియా గేమ్స్‌కు నాగోయా కీలక వేదికగా ఉంది. దీంతో భారీ వర్షాలు క్రీడా వేదికలు, రవాణా ఏర్పాట్లపై ప్రభావం చూపుతాయా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.



