తెలంగాణ

మాజీ మంత్రి కేటీఆర్‌ కారుకు ప్రమాదం

KTR: మాజీ మంత్రి కేటీఆర్ కారుకు ప్రమాదం జరిగింది. కరీంనగర్‌ చౌరస్తా వద్ద కార్యకర్తలు కేటీఆర్‌ కారును ఆపారు. ఈ సమయంలో కారు వెనుక డోర్‌ను తెరవడంతో.. వెనుక నుంచి వస్తున్న లారీ ఆ డోర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగంలోని డోర్‌ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

అయితే కేటీఆర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కరీంనగర్‌లో నిర్వహిస్తున్న యువ సమరభేరి సభకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కార్యకర్తలు ఒక్కసారిగా వాహనాన్ని ఆపడం.. అదే సమయంలో వెనుక డోర్‌ తెరవడంతో ఈ ప్రమాదం జరిగింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button