అంతర్జాతీయం
ఇరాన్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్

ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌తో కొత్త అణు ఒప్పందం కుదిరితేనే అమెరికా విధించిన ఆంక్షలను ఎత్తివేస్తామని స్పష్టం చేశారు. చర్చలు సానుకూలంగా ముగిసి ఒప్పందం కుదిరిన పక్షంలోనే సంబంధాల మెరుగుదలకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
అయితే చర్చలు విఫలమై ఒప్పందం కుదరకపోతే పరిస్థితులు మరింత కఠినంగా మారవచ్చని ట్రంప్ హెచ్చరించారు. అవసరమైతే బల ప్రయోగానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ప్రస్తుతం అమెరికా స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను కూడా ఎలాంటి ఒప్పందం లేకుండా విడుదల చేసే ప్రశ్నే లేదని తేల్చిచెప్పారు.
ట్రంప్ తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


