అంతర్జాతీయం

Earthquake: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం

Earthquake: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.8గా నమోదైనట్లు భూకంప పరిశోధనా సంస్థలు తెలిపాయి. శాంటోస్ నగరానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

భారీ ప్రకంపనలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం ప్రభావం పలు ప్రాంతాల్లో తీవ్రంగా కనిపించినట్లు సమాచారం. దీంతో తీర ప్రాంతాల్లో సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తూ అధికారులు అలర్ట్ జారీ చేశారు.

సముద్ర తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button