అంతర్జాతీయం
అమెరికా ను అతలాకుతలం చేస్తున్న బాంబ్ సైక్లోన్..

అమెరికాను బాంబ్ సైక్లోన్ వణికిస్తోంది. న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. న్యూజెర్సీలోని పలు ప్రాంతాలు జలమయం కాగా.. స్టోన్ హార్బర్లోకి వరద నీరు చేరింది. తుఫాన్ ప్రభావంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
అమెరికాలోని ఏకంగా 25 రాష్ట్రాలపై తుఫాన్ ప్రభావం పడింది. ప్రతికూల వాతావరణం కారణంగా 420 విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరో రెండు వేలకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.



