తెలంగాణ
ఖైరతాబాద్ GHMC జోనల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని GHMC జోనల్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మూడు అంతస్తులకు మంటలు వ్యాపించడంతో కార్యాలయంలోని ఫైల్స్, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దట్టమైన పొగతో పరిసర ప్రాంతాలు కమ్ముకున్నాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



