తెలంగాణ
హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైన రైడ్స్ – 2026

నిర్మాణ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు.. సుస్థిర కట్టడాల రూపకల్పనే లక్ష్యంగా హైదరాబాద్లో ప్రతిష్టాత్మక ‘రైడ్స్ – 2026’ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది.
ప్రారంభోత్సవానికి ఏసీసీఈ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ రాజేంద్ర కల్పావి, మైక్రోసాఫ్ట్ ఏఐ అండ్ ఎంఎల్ డైరెక్టర్ సురేంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి నిపుణులతో పాటు వెయ్యి మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఆధునిక నిర్మాణ రంగంలో వస్తున్న సాంకేతిక మార్పులు, నూతన ఆవిష్కరణలను పరిచయం చేసేందుకు వందకు పైగా స్టాళ్లను ఏర్పాటు చేశారు.



