తెలంగాణ

డ్రగ్స్‌పై సమరభేరి.. నేటి నుంచి కిషన్ రెడ్డి పాదయాత్ర

Kishan Reddy: డ్రగ్స్ మహమ్మారిపై సమరభేరి మోగించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిద్ధమయ్యారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా నేటి నుంచి మూడు రోజుల పాటు ‘నషా ముక్త్ భారత్’ మహా పాదయాత్ర చేపట్టనున్నారు. హైదరాబాద్ అంబర్‌పేటలోని మహంకాళి ఆలయం నుంచి ఉదయం 9 గంటలకు ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది.

కిషన్ రెడ్డితో పాటు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ కె. లక్ష్మణ్, సినీ నటుడు విక్టరీ వెంకటేష్ జెండా ఊపి యాత్రను ప్రారంభించనున్నారు. విద్యార్థులు, యువతలో డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తూ నగరంలోని పలు ప్రాంతాల మీదుగా ఈ పాదయాత్ర సాగనుంది. సినీ ప్రముఖులు, స్వామీజీలు సైతం ఈ కార్యక్రమానికి మద్దతు తెలపనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button