News
శ్రీశైలంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.. వైభవంగా జ్వాలాతోరణ మహోత్సవం

కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో జ్వాలాతోరణ మహోత్సవం వైభవంగా జరిగింది. శ్రీశైలం మల్లన్న దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో క్షేత్రం భక్తజన సంద్రమైంది. ఆలయ ప్రాంగణంలోని గంగాధర మండపం వద్ద స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల సమక్షంలో జ్వాలాతోరణాన్ని ఘనంగా నిర్వహించారు.
ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దంపతులు, ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు జ్వాలాతోరణాలను వెలిగించారు. శివనామస్మరణతో శ్రీశైలం మారుమోగింది. జ్వాలాతోరణం కిందుగా వెళ్లి, భస్మాన్ని నుదుట ధరించేందుకు భక్తులు పోటీపడ్డారు. అనంతరం పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, దశవిధ హారతులు నిర్వహించారు.



