ఆంధ్ర ప్రదేశ్
కార్తీక సోమవారం.. శ్రీశైలంలో పోటెత్తిన భక్తుల రద్దీ..!

కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా నంద్యాల జిల్లా శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మల్లన్న దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. నిన్న ఒక్కరోజే 43,247 మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నట్లు ఆలయ చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు.
భక్తుల రద్దీ దృష్ట్యా నేడు అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. మరోవైపు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, గంగాధర మండపం, ఉత్తర శివమాడ వీధిలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.



