జాతియం
మహారాష్ట్ర చంద్రాపూర్‌లో పెద్దపులి సంచారం!

మహారాష్ట్రలో పెద్దపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. చంద్రపూర్ జిల్లాలోని తలోధి–నాగ్‌భీడ్ రహదారి దాటి చింధీమాల్ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో ఓ పెద్దపులి సంచరించింది. పులిని చూసిన వ్యవసాయ కూలీలు భయంతో పరుగులు తీశారు.
దీంతో పొలాల్లో పనులు చేసేందుకు రైతులు, కూలీలు జంకుతున్నారు. పులి సంచారంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి పులి కదలికలను గుర్తించి, ప్రజలకు రక్షణ కల్పించాలని రైతులు, గ్రామస్థులు కోరుతున్నారు.



