జాతియం
ఢిల్లీలో భారీ వర్షాలు.. 11 జిల్లాలకు రెడ్ అలర్ట్..!

దేశ రాజధాని ఢిల్లీని వాతావరణశాఖ అలర్ట్ చేసింది. ఢిల్లీకి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో ఢిల్లీ సహా ఉత్తర భారతంలోని పలు ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీలోని 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు సమాచారం.
భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అంతేకాదు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని సూచిస్తోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు సమాచారం. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ సూచనలను పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.



