ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు విరాళం

తిరుమల శ్రీవారికి భక్తుడు భారీ కానుక సమర్పించారు. చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్ ఏకంగా 121 కిలోల బంగారు ఆభరణాలను శ్రీవారికి విరాళంగా అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఆభరణాలను టీటీడీకి అందజేశారు.
రంగనాయకుల మండపంలో టీటీడీ ఛైర్మన్, ఈవోతో పాటు ఉన్నతాధికారులు ఈ విరాళాన్ని స్వీకరించారు. టీటీడీ తొమ్మిది దశాబ్దాల చరిత్రలో ఒకే దాత అందించిన అతిపెద్ద బంగారు విరాళంగా ఇది నిలిచింది. శ్రీవారిపై తనకున్న భక్తిని చాటుకుంటూ వర్ధమాన్ జైన్ అందించిన ఈ భారీ కానుక ప్రస్తుతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.



