తెలంగాణ
కీసరగుట్ట ఆలయానికి పోటెత్తిన భక్తులు

కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ శైవక్షేత్రం కీసరగుట్టకు భక్తులు పోటెత్తుతున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు దర్శించుకుంటున్నారు . కొండపై స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు.
కుటుంబ సమేతంగా తరలివస్తున్న భక్తులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. హరహర మహాదేవ.. శంభో శంకర నామస్మరణతో కీసరగుట్ట మార్మోగుతోంది. కార్తీక మాసం కావడంతో సాధారణ రోజుల కంటే భక్తుల రద్దీ మరింత పెరిగింది. దీపాల వెలుగులు, ప్రత్యేక పూజలతో కీసరగుట్ట ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.



