తెలంగాణ

అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్

అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్.. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల బాధితుల బాండ్ల ధృవీకరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. డిసెంబర్ 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. రెండు జిల్లాలకు చెందిన మొత్తం 6,808 మంది బాధితుల కోసం నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

మండలాల వారీగా షెడ్యూల్ ప్రకటించారు. బాధితులు నిర్ణీత తేదీల్లో అసలు బాండ్లు, నగదు రసీదులు, ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వివరాలతో హాజరుకావాలని అధికారులు సూచించారు. అసలు బాండ్లను అధికారులకు సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button