తెలంగాణ
కూలేశ్వరంగా మారిన కాళేశ్వరం.. కేటీఆర్‌పై సీతక్క ఫైర్

ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. జిల్లా కేంద్రంలో 5 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సెంట్రల్ డివైడర్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వరంగల్‌కు విమానాశ్రయం ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. గత పదేళ్లలో పేదలకు లక్ష ఇళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి బీఆర్ఎస్ పాలనలో ఉందని విమర్శించారు.
రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని, లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి కూలేశ్వరంగా మారిందంటూ ఎద్దేవా చేశారు. తప్పుడు మాటలతో ప్రజలను వంచించాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సీతక్క స్పష్టం చేశారు.



