Gudivada Amarnath: లోకేష్‌కు గుడివాడ అమర్నాథ్ ఓపెన్ ఛాలెంజ్.. గెలుసిల్ బాటిల్ రెడీగా పెట్టుకోండి!

Gudivada Amarnath: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు, కంపెనీల రాకపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల విషయంలో క్రెడిట్ తీసుకుంటున్నారంటూ మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. పెట్టుబడులపై గొప్పలు చెప్పడం కాదని, ఏయే కంపెనీలు ఎప్పుడు రాష్ట్రానికి వచ్చాయి, ఎప్పుడు ఒప్పందాలు కుదుర్చుకున్నాయో తేదీలతో కూడిన ప్రాజెక్టు ఫైళ్లు, ఎంఓయూలను బయటపెట్టాలని లోకేష్‌కు బహిరంగ సవాల్ విసిరారు.
ఏపీలో విద్యుత్ డిమాండ్ తగ్గుతోందని, రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో ఆశించిన వృద్ధి లేదని, నిరుద్యోగం పెరుగుతోందని గణాంకాలను ప్రస్తావించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం చెబుతున్న అభివృద్ధి లెక్కలు వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయని ఆరోపించారు. మరోవైపు జేఎస్‌డబ్ల్యూ, బ్రూక్‌ఫీల్డ్, ఏఎం గ్రీన్, రెన్యూ పవర్, శ్రీ సిమెంట్ వంటి సంస్థల పెట్టుబడి నిర్ణయాలు గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని పేర్కొన్నారు. ఆయా కంపెనీల పెట్టుబడుల విషయంలో టీడీపీ ప్రభుత్వం క్రెడిట్ తీసుకుంటోందని విమర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందించిన గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి.



