తెలంగాణ

Harish Rao: పల్నాడు ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు..!

Harish Rao: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలపై ప్రశ్నిస్తుంటే సీఎం దుమ్మెత్తిపోస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి నీళ్లు ఎత్తడం రాదని.. బీఆర్ఎస్‌పై మట్టి ఎత్తడం మాత్రమే వచ్చంటూ విమర్శించారు. సీఎం హోదాలో అబద్ధాలు చెబితే నిజాలు అయిపోవని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని, 218 టీఎంసీల నీటి నిల్వలను పెంచామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క టీఎంసీ నీటి నిల్వ కూడా పెంచలేదని ఆరోపించారు.

మరోవైపు పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై కూడా హరీష్ రావు ప్రశ్నలు సంధించారు. ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్ తాగునీటికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్నారు. నాగార్జునసాగర్ నుంచి నీటిని తరలించే ప్రయత్నాలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేఆర్ఎంబీ సమావేశంలోనూ పల్నాడు ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావించలేదని ఆరోపించారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button