తెలంగాణ

Ponnam Prabhakar: SIR పేరుతో ఓటర్ల హక్కులను హరించే కుట్ర

Ponnam Prabhakar: బీజేపీపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైరయ్యారు. SIR పేరుతో ఓటర్ల హక్కులను హరించే కుట్ర జరుగుతోందని మంత్రి పొన్నం మండిపడ్డారు. ఓటర్ల జాబితాలో తొలగింపులు, ఎన్నికల డేటాలో మార్పులు, ఎన్నికల కమిషన్ స్వతంత్రతపై రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్‌కు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్.. తెలంగాణ అభివృద్ధి, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడకుండా రాహుల్ గాంధీని విమర్శించడమేంటని ప్రశ్నించారు.

SIRపై పార్లమెంట్‌లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి చర్చించేందుకు బీజేపీ ఎందుకు వెనుకాడుతోందని నిలదీశారు. చొరబాటుదారుల ఓట్లను కాంగ్రెస్ రక్షించాలని కోరడం లేదని, అక్రమ చొరబాట్లను అడ్డుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button