ట్రంప్ దూకుడు.. భారత్‌పై మరోసారి టారిఫ్‌ల వేట!

భారత ఎగుమతులపై అమెరికా మరోసారి టారిఫ్‌ల కొరడా ఝుళిపించేందుకు సిద్ధమవుతోందా..? అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొత్తగా భారీ సుంకాలు విధించేందుకు రంగం సిద్ధం చేస్తోందా..? అంటే తాజా పరిణామాలు అవుననే సంకేతాలిస్తున్నాయి. భారత్ సహా 16 దేశాలపై కొత్త టారిఫ్‌లు విధించే అంశాన్ని అమెరికా పరిశీలిస్తోంది. ఆయా దేశాలు తమ పరిశ్రమలకు భారీగా సబ్సిడీలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందిస్తూ అమెరికా సంస్థలకు పోటీని పెంచుతున్నాయన్నది ట్రంప్ ప్రభుత్వ ఆరోపణ. ఈ అంశంపై అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ నేతృత్వంలో చేపట్టిన విచారణ నివేదిక త్వరలో వెలువడనుంది.
చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, ఐరోపా సమాఖ్య సహా పలు దేశాల ఎగుమతులపై అదనపు సుంకాలు విధించే అవకాశం ఉందని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం వెల్లడించింది. అయితే తుది టారిఫ్ శాతాలపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్న సమయంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఉన్న సుంకాలకు అదనంగా కొత్త టారిఫ్‌లు అమల్లోకి వస్తే భారత ఎగుమతులపై ఎలాంటి ప్రభావం పడుతుంది



