తెలంగాణ
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కర్ణాటక డిప్యూటీ సీఎం పరమేశ్వర్ వేర్వేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వారికి ఆశీర్వచనం అందించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. భవిష్యత్తులో సంభవించే వరదల నుంచి రాష్ట్రాలతో పాటు ప్రపంచ దేశాలను స్వామివారు కాపాడాలని ప్రార్థించినట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.



