తెలంగాణ
జలాల కోసం పోరాడితే అరెస్టులా.. ప్రభుత్వంపై జగదీష్ ఫైర్!

బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్టులపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు KRMBకి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న తమ పార్టీ నేతలను ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. సబితా ఇంద్రారెడ్డి, కాలేరు వెంకటేష్, భూపాల్ రెడ్డితో పాటు పలువురు నేతలను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు.
నాగార్జునసాగర్ వద్ద ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపడుతోందని, దీనివల్ల తెలంగాణకు తాగు, సాగునీటి ముప్పు పొంచి ఉందని విమర్శించారు. అరెస్ట్ చేసిన నేతలను వెంటనే విడుదల చేసి, KRMBకి వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు.



