ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో రసవత్తరంగా స్థానిక ఎన్నికలు

ఏపీలో స్థానిక ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. రెండో రోజు కోలాహలంగా నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రెండో రోజు నామినేషన్ల దాఖలుతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. మొదటి రోజు మొత్తం 690 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు. నిన్న చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటనల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగేలా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు యంత్రాంగం నిఘా పెంచింది.
మొత్తానికి రెండో రోజు నామినేషన్లతో ఏపీలో స్థానిక ఎన్నికల సందడి కొనసాగుతోంది. రానున్న రోజుల్లో నామినేషన్ల దాఖలు ఏ స్థాయికి చేరుతాయి? ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.



