సినిమా
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చిన ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం పండితులు ఆయనకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రికి రావడంతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది.



