వ్యాపారం
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే పసిడి ధర దాదాపు 1,600 రూపాయలు పెరగగా.. వెండి ధర ఏకంగా 5 వేల రూపాయలకు పైగా ఎగబాకింది. హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్షా 28 వేల 510 రూపాయలుగా ఉంది.
ఇక కిలో వెండి ధర లక్షా 56 వేల 172 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు పెరుగుదల బాట పట్టాయి. స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 3,629 డాలర్లు కాగా.. వెండి 43 డాలర్లుగా కొనసాగుతోంది.



