వ్యాపారం

Stock Market: భారీ లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు!

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో అద్భుతంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదరడంతో గ్లోబల్ మార్కెట్లతో పాటు మన మార్కెట్లలోనూ జోష్ నెలకొంది. ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 1,200 పాయింట్లకు పైగా లాభపడగా ఇటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 400 పాయింట్లకు పైగా పెరిగి ట్రేడింగ్‌ను సాగిస్తోంది.

గత కొన్ని నెలలుగా పశ్చిమాసియాలో సాగుతున్న యుద్ధ వాతావరణానికి తెరదించుతూ అమెరికా, ఇరాన్ దేశాలు శాంతి ఒప్పందాన్ని ప్రకటించాయి. దీంతో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ సరఫరాకు అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ జలసంధిపై ఉన్న ఆంక్షలు తొలగిపోవడంతో, చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. ఈ సానుకూల పరిణామాలు భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంతో ఇన్వెస్టర్లు బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఎనర్జీ రంగాల షేర్లను కొనుగోలు చేయడానికి అమితాసక్తి చూపిస్తున్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button