తెలంగాణ
తెలంగాణలో నేటి నుంచే పాఠశాలలు పునఃప్రారంభం

తెలంగాణలో వేసవి సెలవుల తర్వాత నేటి నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ ఈరోజే తెరుచుకుంటున్నాయి. దాదాపు యాభై రోజులకు పైగా సాగిన సమ్మర్ వెకేషన్ ముగియడంతో విద్యార్థులంతా మళ్లీ బడి బాట పట్టారు. దీంతో విద్యాసంస్థల ప్రాంగణాలు మళ్లీ సందడిగా మారాయి.
ఇక ప్రభుత్వ పాఠశాలల్లో తొలిరోజే విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బడుల పునఃప్రారంభం నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాలల్లో మౌలిక వసతులు, పారిశుధ్య పనులను ఇప్పటికే పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.



