తెలంగాణ
KTR: తెలంగాణలో దుర్మార్గ పాలన పోవాలి, కేసీఆర్ పాలన రావాలి

KTR: సత్తుపల్లిలో రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని, ప్రజలు మళ్ళీ కేసీఆర్ పాలన కోసం ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. సీతారామ ప్రాజెక్టును తామే చేపట్టామని, కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ నుంచి యూరియా కొరత వరకు ప్రతి విషయంలోనూ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.



