జాతియం
గుజరాత్లో దంచికొడుతున్న వర్షాలు

గుజరాత్‌ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. 36 గంటల వ్యవధిలోనే 12 వందల మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో వరదలు పోటెత్తాయి. వల్సాద్ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. వరద నీటిలో చిక్కుకున్న 12 వందల మందిని సహాయక బలగాలు రక్షించగా.. 22 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వాపీలో రహదారులు జలమయమై వాహనాలు నీట మునిగాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టాయి. గుజరాత్ పరిస్థితులపై ప్రధాని నరేంద్రమోదీ ఆరా తీశారు. రాష్ట్రానికి అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.



