ఆంధ్ర ప్రదేశ్

హైదరాబాద్–తిరుపతి మధ్య కొత్త FLY91 విమాన సేవలు

తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులకు కొత్త విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్–తిరుపతి మధ్య FLY91 ఎయిర్‌లైన్స్ కొత్త విమాన సేవలను ప్రారంభించింది. IC 3501 విమానం హైదరాబాద్ నుంచి మంగళ వారం, గురువారం, శనివారం, ఆదివారాల్లో ఉదయం 6 గంటల 5 నిమిషాలకు, సోమవారం, బుధవారం, శుక్రవారాల్లో ఉదయం 6 గంటల 15 నిమిషాలకు బయలుదేరుతుంది.

సుమారు గంటా 35 నిమిషాల ప్రయాణం అనంతరం ఉదయం 7 గంటల 40 నిమిషాలకు తిరుపతి చేరుకుంటుంది. కొత్త సర్వీసుతో హైదరాబాద్–తిరుపతి మధ్య ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది. రేణిగుంట ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ భూమినాదం, ఎయిర్‌లైన్స్ సిబ్బంది ప్రయాణికులకు ఘన స్వాగతం పలికారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button