ఆంధ్ర ప్రదేశ్

ఏపీ సచివాలయంలో ఇవాళ, రేపు కలెక్టర్ల కాన్ఫరెన్స్

ఏపీ సచివాలయంలో ఇవాళ, రేపు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

ప్రధానంగా ప్రజా సమస్యలు, వాటి పరిష్కారంపై సీఎం సమీక్షించనున్నారు. సూపర్ సిక్స్ హామీలు, సంక్షేమ పథకాల అమలు తీరుపైనా చర్చించనున్నారు. అలాగే రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై కూడా కీలక సమీక్ష జరగనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button