అంతర్జాతీయం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు షాక్.. H-1B వీసా ఫీజుపై కోర్టు కీలక తీర్పు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్ తగిలింది. హెచ్1బీ వీసాలకు లక్ష డాలర్ల ఫీజు విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా కోర్టు కొట్టివేసింది. ఈ నిర్ణయం చట్టవిరుద్ధమని బోస్టన్ ఫెడరల్ కోర్టు స్పష్టం చేసింది.
గత సెప్టెంబర్‌లో హెచ్1బీ వీసాకు ఎంపికైన అభ్యర్థులు అదనంగా లక్ష డాలర్ల ఫీజు చెల్లించాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిపై పలు వర్గాలు కోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టిన ఫెడరల్ కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేసింది.



