తెలంగాణ

గాంధీ భవన్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ సందీప్‌ను కలిసిన ఆది శ్రీనివాస్

గాంధీ భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ నూతన ఏఐసీసీ ఇన్‌చార్జ్ సందీప్‌ను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర, సభలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని ఆది శ్రీనివాస్ అన్నారు. సీఎం స్థాయిలో ఉన్నప్పటికీ కార్యకర్తలతో కలిసి నడుస్తూ తాను సామాన్య కార్యకర్తనే అని రేవంత్ రెడ్డి నిరూపిస్తున్నారని అన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ప్రజలకు, కార్యకర్తలకు దూరంగా ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తోందని తెలిపారు. రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button