తెలంగాణ
Arvind Dharmapuri: కాంగ్రెస్‌ను ఖతం చేస్తాం.. ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

Arvind Dharmapuri: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా బిల్లు కూడా అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. త్వరలోనే డీలిమిటేషన్‌కు సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లు ప్రజల ముందుకు వస్తుందని వెల్లడించారు.
అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ అధికారంలోకి వస్తే క్వింటాల్ పసుపు ధర 50 వేల రూపాయలు దాటేలా చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.



