ఈజిప్టులో ఘోర ప్రమాదం.. 31 మంది సజీవ దహనం!

ఈజిప్ట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. రాజధాని కైరో సమీపంలోని రింగ్ రోడ్డుపై ఇంధన ట్యాంకర్ బోల్తాపడి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కనీసం 31 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. గ్రేటర్ కైరో పరిధిలోని గిజా ప్రావిన్స్ వార్రాక్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. పెట్రోలియం ఉత్పత్తులతో వెళ్తున్న ట్యాంకర్‌పై హై-వోల్టేజ్ విద్యుత్ తీగ తెగిపడటంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం.
దీంతో ట్యాంకర్ డివైడర్‌ను ఢీకొని బోల్తాపడటంతో భారీగా మంటలు వ్యాపించాయి. ట్యాంకర్ నుంచి ఇంధనం లీకవడంతో సమీపంలోని 27కు పైగా కార్లు, ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు 39 అంబులెన్స్‌లతో సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలకు ఆదేశించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఈజిప్ట్ ప్రధాని ఆదేశించారు.



