అసెంబ్లీ గేటు దగ్గర హైటెన్షన్.. టీ షర్ట్ విప్పి నిరసన తెలిపిన హరీష్ రావు

అసెంబ్లీ గేటు దగ్గర హైటెన్షన్ నెలకొంది. నల్ల టీషర్టులతో అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పి తోపులాటకు దారితీసింది.
ఈ తోపులాటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు స్వల్ప గాయాలయ్యాయి. మరో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కాలికి గాయం అయింది. మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కూడా కన్నీరు పెట్టుకున్నారు. పోలీసులు తన చీర లాగారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
హరీష్ రావు టీ-షర్ట్ విప్పి నిరసన తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ సభ్యులను అరెస్ట్ చేశారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజే బీఆర్ఎస్ ఆందోళనతో అసెంబ్లీ పరిసరాలు ఒక్కసారిగా రాజకీయ వేడితో హీటెక్కాయి.



