Revanth Reddy: సైబర్ క్రైమ్ సమాజానికి పెనుముప్పుగా మారింది

Revanth Reddy: సైబర్ క్రైమ్ సమాజానికి పెనుముప్పుగా మారిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో గుర్తించడం సవాలుగా మారిందని పేర్కొన్నారు. హైదరాబాద్ హోటల్ తాజ్ కృష్ణాలో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటి సౌత్‌జోన్ రీజినల్ కాన్ఫరెన్స్ జరిగింది. సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
పిల్లలు ఎక్కువ సమయం ఇంటర్నెట్లో గడుపుతున్న నేపథ్యంలో.. వారు ఆన్లైన్లో ఏం చూస్తున్నారనే విషయంపై తల్లిదండ్రులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని రేవంత్ సూచించారు. తెలియకుండానే పిల్లలు సైబర్ నేరాల వలలో చిక్కుకునే ప్రమాదం ఉందన్నారు.
తెలంగాణలో మహిళలు, పిల్లల రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రేవంత్‌రెడ్డి తెలిపారు. భరోసా కేంద్రాలు, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, ప్రత్యేక కోర్టులు, న్యాయ సేవా సంస్థలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.



