తెలంగాణ
కేటీఆర్, హరీశ్ రావులను అరెస్ట్ చేసిన పోలీసులు

మేడ్చల్ జిల్లా హకీంపేటలో ఉద్రిక్తత తలెత్తింది. బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌కు వెళ్తున్న కేటీఆర్, హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. అయితే.. వాహనాల్లో నుంచి దిగి ఫాంహౌస్‌కు వెళ్లేందుకు హరీష్, కేటీఆర్ ప్రయత్నించారు. దీంతో హరీష్ రావు, కేటీఆర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హరీష్ రావును జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించగా.. కేటీఆర్‌ను బోయిన్‌పల్లి పీఎస్‌కు తరలించారు.



