ఆంధ్ర ప్రదేశ్
ఏపీ, తెలంగాణలో ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు

తెలుగు రాష్ట్రాల్లో ఈడీ అధికారులు మరోసారి సోదాలు చేపట్టారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఏకకాలంలో దాదాపు 15 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక ఈడీ బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. ముఖ్యంగా కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ అమ్మకాల కేసుకు సంబంధించి ఈ దాడులు జరుగుతున్నాయి.
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నిందితులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేయగా.. వారిచ్చిన సమాచారం ఆధారంగా హైదరాబాద్‌లో 7 చోట్ల, బెంగళూరులో మరో 2 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నారు.



