క్రీడలు

Ajinkya Rahane: రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ అజింక్య రహానే

Ajinkya Rahane: భారత క్రికెట్ జట్టులో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మిడిలార్డర్ దిగ్గజం, మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. జీవితంలో ప్రతి పనికీ ఒక ఆరంభం, ముగింపు ఉంటుందని, ఇవాళ తాను ఆటకు వీడ్కోలు పలికే సమయం వచ్చిందని రహానే భావోద్వేగంతో వెల్లడించారు. తన సుదీర్ఘ కెరీర్‌లో భారత్ తరఫున 85 టెస్టులు ఆడిన ఆయన 5 వేల 77 పరుగులు చేసి 12 సెంచరీలు నమోదు చేశారు.

అలాగే 90 వన్డేలు, 20 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలోనూ టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు. ముఖ్యంగా 2020-21 ఆస్ట్రేలియా గడ్డపై విరాట్ కోహ్లీ లేని స్థితిలోనూ అద్భుత నాయకత్వ లక్షణాలు ప్రదర్శించి.. భారత్‌కు చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ విజయాని అందించిన కెప్టెన్‌గా రహానే చరిత్ర సృష్టించారు. ఆయన రిటైర్మెంట్‌తో క్రికెట్ వర్గాలు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూనే, ఆయన సేవలను కొనియాడుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button