ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2027 షెడ్యూల్ విడుదల

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్-2027 షెడ్యూల్ విడుదలైంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్త ఆతిథ్యంలో జరగనున్న ఈ మెగా టోర్నీ.. సరికొత్త ఫార్మాట్లో సాగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 7న కేప్‌టౌన్‌లో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ జరగనుంది. ఇక భారత్-పాకిస్థాన్ హై-వోల్టేజ్ మ్యాచ్ అక్టోబర్ 10న జోహన్నెస్‌బర్గ్‌లో జరగనుంది.
ఈసారి ప్రపంచకప్‌లో 14 జట్లు పాల్గొననుండగా గ్రూప్ దశకు 12 జట్లు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత సూపర్-7 దశలో కొత్త ఫార్మాట్‌తో పోటీ మరింత ఆసక్తికరంగా సాగనుంది. గ్రూప్ దశలో సాధించిన పాయింట్లను సూపర్-7లో పరిగణనలోకి తీసుకోకుండా అన్ని జట్లు సున్నా పాయింట్లతో కొత్తగా పోటీ ప్రారంభిస్తాయి. సూపర్-7లో టాప్-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకుంటాయి.
తొలి సెమీఫైనల్ నవంబర్ 17న కేప్‌టౌన్‌లో రెండో సెమీఫైనల్ నవంబర్ 18న ష్వానేలో జరగనుంది. నవంబర్ 21న జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో ఫైనల్‌తో విశ్వవిజేత ఎవరో తేలనుంది. కొత్త ఫార్మాట్.. కీలక మ్యాచ్‌లు.. భారత్-పాకిస్థాన్ పోరు వెరసి 2027 వన్డే ప్రపంచకప్‌పై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.



