నాటో దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్

నాటో దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. కలినిన్‌గ్రాడ్‌పై నేరుగా దాడి జరిగితే.. అణ్వాయుధాల వినియోగాన్ని కూడా పరిశీలిస్తామని పుతిన్ హెచ్చరించారు. రష్యా భూభాగంపై దాడి జరిగితే అందుబాటులో ఉన్న అన్ని రకాల ఆయుధాలను ఉపయోగించే అంశాన్ని తక్షణమే పరిశీలిస్తామని స్పష్టం చేశారు. రష్యాకు యూరప్‌లోని ఏ దేశంపైనా దాడి చేసే ఉద్దేశం లేదని పుతిన్ తెలిపారు. ఐరోపా దేశాలతో శాంతియుతంగా కలిసి జీవించాలనేదే తమ ఆకాంక్ష అని తెలిపారు.
అయితే తమ భూభాగంపై ప్రత్యక్ష దాడి జరిగితే తీవ్రంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. నాటో సైనికంగా రష్యా కంటే రెండింతలు పెద్దదని పుతిన్ అన్నారు. ఫ్రాన్స్, బ్రిటన్ అణ్వాయుధ సామర్థ్యంపై తమకు పూర్తి అవగాహన ఉందని.. తమ వద్ద కూడా ప్రత్యర్థులపై ఆధిక్యం సాధించగల ఆయుధాలు ఉన్నాయన్నారు. అణ్వాయుధాల వినియోగం ప్రపంచానికి పెను ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని.. అలాంటి పరిస్థితి రాకుండా దేశాలు జాగ్రత్తగా వ్యవహరించాలని పుతిన్ సూచించారు.



